Kandala Upender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు.. భూకబ్జా ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandala Upender Reddy: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్‌పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ జీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నం.3లో ప్లాట్ నంబరు 8-c పేరుతో ఉన్న 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థకు చెందిన ఉపేందర్రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్రెడ్డి ‘8-Cలో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎక రాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్నగర్ బస్తీగా ఏర్పడగా 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.
Read also: Mudragada Padmanabham: ముద్రగడ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారు.. నేను కూడా పోటీ చేస్తా: గిరిబాబు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. కాగా, తహసీల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొల గించి, షెడ్లు నిర్మించి వైన్షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో రాత్రి తహసీల్దార్ లోపాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉపేందర్ రెడ్డి తదితరు సెక్షన్లు 447, 427, 467, 468, 471, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్నా ‘కోట బొమ్మాళి పీఎస్’.. అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన ఆహా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!