Munugode Bypoll: మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Bypoll: నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 14 వరకుకొనసాగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. అయితే అందరు అనుకున్నట్లు గానే మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read also:Jammu Kashmir: కాశ్మీర్‌లో మొదలైన మార్పు.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రికార్డు
Also Read
అక్టోబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ ప్రకటించి ఈసీ. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు. ఇక, నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
Read also: RBI: ఆర్బీఐ @ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ
మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ 14 వరకుకొనసాగనుంది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే… స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఎన్నికల రిటర్నరింగ్ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు… ఎన్నికల కోడ్ ఈనెల 3నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెలిస్సిందే. కాగా, ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు మీటర్ల దూరం వరకు బారికెడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు… వారి వాహనాల పార్కింగ్ కోసం స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేశారు… నియోకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్‌పోస్టుల్లో నిరంతం తనిఖీలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!