S*x Racket Busted : మసాజ్ పేరుతో వ్యభిచారం.. 15 మంది యువతులు, 27 మంది విటులు రెడ్ హ్యాండెడ్‌గా..
- కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో మెరుపు దాడులు
- 15 యువతులు, 27 విటులు అదుపులోకి
- మసాజ్ పేరుతో అసాంఘిక దందా బట్టబయలు
- రెండు బ్రాంచ్‌లపై పోలీసులు దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*x Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని గాయత్రి రెసిడెన్సీలో ఉన్న ‘ఆసన వెల్నెస్ స్పా’ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 15 మంది యువతులను, 30 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు కాగా, మిగిలిన 27 మందిని విటులుగా గుర్తించి అందరిపై కేసులు నమోదు చేశారు.
Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
పోలీసుల విచారణలో ఈ దందాకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇర్ఫాన్ అనే వ్యక్తి గత ఏడాది కాలంగా ఈ స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫుల్ బాడీ మసాజ్, అరోమా మసాజ్ వంటి పేర్లతో కస్టమర్లను ఆకర్షించి, లోపల నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ , వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఈ ముఠాకు కూకట్పల్లి 9వ ఫేజ్‌లో కూడా మరో బ్రాంచ్ ఉన్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రైడ్ సందర్భంగా నిందితుల నుంచి పోలీసులు 45 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పా సెంటర్ల ముసుగులో ఇలాంటి అసాంఘిక పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టుబడ్డ యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించగా, నిర్వాహకులు , విటులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. నగరంలో ఇలాంటి అక్రమ సెంటర్ల జాబితాను తయారు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!