గత కొంత కాలంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పెండింగ్ లో వున్న టీచర్ల సమస్యలు పరిష్కారించాలని అకుట్ అధ్యక్షులు ప్రొఫెసర్ తౌటం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ వీసీ తీరుపై మండిపడ్డారు. ఎన్నిసార్లు యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లకు వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలుతీసుకోలేదన్నారు.
టీచర్లపై కక్షపూరితచర్యలకు పాల్పడుతూ, రెగ్యులర్ టీచర్ల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్న వీసీ, రిజిస్ట్రార్ లు చేస్తున్న అక్రమాలను ఎండగట్టడంమే మ ప్రధాన డిమాండ్ అన్నారు. కె.యూ గెస్ట్ హౌజ్ లో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకూట్) అధ్యక్ష కార్యదర్శులు ప్రొ.టీ.శ్రీనివాస్, డా. మామిడాల ఇస్తారి లు మీడియాతో యూనివర్సిటీలో నెలకొన్న పలు టీచర్ల సమస్యలపై మాట్లాడారు.
Read Also: Muttu: రెండు రోజులు వెనక్కి వెళ్ళిన శింబు తెలుగు సినిమా!
ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వకపోవడం అనైతికం. యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ సుముఖత వ్యక్తం చేయడం లేదన్నారు. సదరు ఉద్యోగి వీటి కోసం కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి యూనివర్సిటీలో నెలకొందన్నారు. ప్రతీది కోర్టు ద్వారా సాధించుకోవాలంటే మరి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అని వారంతా ప్రశ్నించారు. వెంటనే యూనివర్సిటీ లో పనిచేస్తున్న టీచర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కొరకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 12 సంవత్స రాల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కొనసాగుతున్న ఇద్దరు టీచర్లకు ఎటువంటి ఆర్డర్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా గత రెండు నెలల నుండి అడ్మినిస్ట్రేషన్ అధికారులు జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు.
Read Also:Sunny Leone: బ్లూ కలర్ బికినీ లో సన్నీ.. సెగలు పుట్టిస్తుందే