NTV Telugu Site icon

KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

Ktr

Ktr

KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ కార్డులో వరి పంటకు రూ. 500 బోనస్ ప్రకటించారు. ప్రచారంలో ప్రతి గింజను అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారన్నారు. ఇది ప్రజల పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. నిన్నమొన్నటి వరకు సాగునీరు ఇవ్వక, కరెంట్ కోతలతో పంటలను ఎండబెట్టి, కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక, అకాల వర్షాలు కురవక వానలు కురిశాయి. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ. 15,000 రైతు భరోసా.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదు.

Read also: Lavu Sri Krishna Devarayalu: అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడులో అరాచకం సృష్టించారు..

డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు.. అది చేయలేదన్నారు. నేడు బోనస్ విషయంలోనూ ప్రభుత్వ బోగస్ విధానం బట్టబయలైందన్నారు. ఓట్ల నాడు ఒకమాట… నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో.. గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు అన్నారు. ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదన్నారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరన్నారు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారన్నారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. అంటూ కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.


Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్‌ ఫ్రాడ్‌..