KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.