Site icon NTV Telugu

KTR Twitter: భట్టి విక్రమార్క మాట మార్చారు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్

Ktr

Ktr

KTR Twitter: ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో పాటు అందరినీ మోసం చేయడం ప్రారంభించిందని విమర్శించారు.

Read also: Bear in Kamareddy: కామారెడ్డిలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు

అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.4వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అన్ని పత్రికల్లో మొదటి పేజీల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రచారం చేసింది. నిజానికి బీఆర్ఎస్ పాలనలో నింపబడిన 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ఆ ఉద్యోగాలను కాంగ్రెస్‌ పార్టీ సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకుందని మండిపడ్డారు.

Read also: Chilkur Balaji Temple: చిలుకూరు ఆలయానికి క్యూ కట్టిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్

అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్న హామీపై యూ టర్న్ తీసుకుని టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు (2 పేపర్లకు) పెంచిందని పేర్కొన్నారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని తెలిపారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని అన్నారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Sekhar Kammula : “లీడర్ 2” తప్పకుండా చేస్తా.. కానీ..?

Exit mobile version