Site icon NTV Telugu

KTR : చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా.. పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ

Kavitha Ktr

Kavitha Ktr

KTR : తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ (X) వేదికగా బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన పోస్టులో, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సమస్యలు వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అనేక స్కాంల ఆరోపణలు వచ్చినా, బీజేపీ మాత్రం నిశ్శబ్దంగా ఉంటోందని మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి, చివరికి హైకోర్టే పరీక్ష రద్దు చేయాలని చెప్పిందని గుర్తుచేసిన కేటీఆర్, ఇంత పెద్ద నేరపూరిత నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడినా రాష్ట్ర బీజేపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. వర్షాకాల సమావేశాలలోపే?

తన ప్రభుత్వ కాలంలో ప్రతి అంశానికీ సీబీఐ విచారణ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు గ్రూప్-1 స్కాం విషయంలో అదే ఎందుకు కోరడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. “డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణల మీద కూడా బీజేపీ నోరు మూసుకుందేంటి?” అని కేటీఆర్ ట్వీట్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ మౌనం, సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేయకపోవడం.. ఇవన్నీ రేవంత్-బీజేపీ రహస్య మైత్రికి మరో ఉదాహరణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Raghunandan Rao : ఫలించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషి

Exit mobile version