KTR: ప్రభుత్వంను ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని తెలిపారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Ranbir Kapoor: అనిమల్ పార్క్… బ్రహ్మాస్త్ర 2 కన్నా ముందే మరో పాన్ ఇండియా సినిమా?
రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని వ్యంగాస్త్రం వేశారు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అంటూ కేటీఆర్ చిట్ చాట్ ద్వారా తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.
Read also: CM Revanth Reddy: మరో మార్గంలో మెట్రో ప్రాజెక్టు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
ఇక మరోవైపు అంతర్జాతీయ సూచీలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే.. గత పదేళ్లుగా సుస్థిర పాలన, శాంతియుత రాజకీయ వాతావరణం కారణంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా నివేదిక వెల్లడించింది. మెర్సర్స్ వరల్డ్‌వైడ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో, హైదరాబాద్ భారతదేశం నుండి అత్యుత్తమ ర్యాంక్ పొందింది. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంతర్జాతీయ సూచీలో హైదరాబాద్ ఘనత సాధించడం గర్వకారణమన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరం మెర్సర్స్ జాబితాలో ఆరుసార్లు అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.
Prabhas Mahesh: సోషల్ మీడియాను కబ్జా చేసిన ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్!