KTR twitter: మోదీ .. అచ్చేదిన్ ఇవేనా! కేటీఆర్ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నేటితో 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
మోదీ అచ్చే దిన్‌కు 8 ఏళ్లు నిండాయన్న కేటీఆర్… ఈ 8 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ సంధించారు. ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందన్న కేటీఆర్…45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని పేర్కొన్నారు.
Also Read
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Voters List: తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.. మీ ఓటు లేకపోతే ఇలా చేయండి..
- LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
- CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరిందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని పేర్కొన్నారు కేటీఆర్.
Dear Modi Ji,
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrsWell done Sir👏 https://t.co/m2Yx3zF4is
— KTR (@KTRTRS) May 16, 2022
02 May 2022 లో.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా మోదీపై ఆయన చేసిన విమర్శలు ఇటు తెలంగాణ.. అటు కేంద్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.
మోదీకి విజన్ కొరత..!‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. వంటివన్నీ ఉన్నాయన్నారు. అయితే అన్ని సమస్యలకూ మూలం పీఎం మోదీకి విజన్ కొరత కావడమే’ అని కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్‌పై పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు మాత్రం ఘాటుగా రిప్లయ్ ఇస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌పై రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
— KTR (@KTRTRS) May 2, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్‌నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
-
Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
-
Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
-
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
-
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!