KTR: శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- నేతన్నలు, రైతుల సమస్యలపై సమాధానాలు చెప్పాలని ప్రశ్న
- ఆరు గ్యారెంటీల అమలుపై తేదీలు ప్రకటించాలని డిమాండ్
- సిరిసిల్ల అభివృద్ధి పనులపై సీఎం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. పర్యటనలో భాగంగా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, సిరిసిల్ల ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలకు, ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలని లేఖలో కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనుల బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భూ ఆరోపణలపై శ్వేతపత్రం.. నేతన్నల బకాయిలు చెల్లించాలి
సిరిసిల్ల ప్రాంతంలో 8 వేల ఎకరాల భూములకు సంబంధించి , 2,400 ఎకరాలను రికవరీ చేశామంటూ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సదరు 2,400 ఎకరాలు ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్ల పరిధిలోకి వస్తాయో వివరాలను బహిర్గతం చేస్తూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఒకవేళ ఆ ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు సిరిసిల్ల చేనేత, జౌళి రంగాన్ని ఆదుకోవడానికి 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తారో, రూ. 5 లక్షల నేతన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టం చేయాలన్నారు. సిరిసిల్లలో యార్న్ డిపో ఏర్పాటు, వీవింగ్ పార్క్ ప్రారంభం, అపారెల్ పార్క్‌లో కొత్త పరిశ్రమల స్థాపనపై ముఖ్యమంత్రి తన పర్యటనలో స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు.
Also Read
రైతుబంధు, రుణమాఫీ బకాయిలు ఏవి.. నీటి తరలింపుపై స్పష్టత ఇవ్వాలి
వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలు రైతులకు రైతుబంధు అమలు, ఎకరాకు రూ. 15 వేల సాయం ఎప్పటి నుంచి అందిస్తారో కేటీఆర్ ప్రశ్నించారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తిగా పూర్తి చేస్తారో, అలాగే రైతుబీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలన్నారు. మల్కపేట జలాశయం నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని ఎప్పుడు తరలిస్తారో తెలపాలని కోరారు. దాంతో పాటు సిరిసిల్లకు రాబోయే కొత్త పరిశ్రమల సంఖ్య, ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పురోగతిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక జేఎన్టీయూ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీకి నిధుల విడుదల, ‘మన ఊరు – మన బడి’ పనుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్లకు దిక్కేది.. తేదీలను ప్రకటించాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన తేదీలను ప్రకటించాలని కేటీఆర్ కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 2,500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం, పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్లు, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు , ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలన్నారు. సీఈఎస్ఎస్ (CESS) రద్దుపై వచ్చిన వార్తలకు సమాధానం ఇవ్వడంతో పాటు, ‘ఏక్ పోలీసు’ వ్యవస్థ హామీ అమలుపై నిలదీశారు. సిరిసిల్ల వైద్యరంగానికి అదనపు నిధులు కేటాయించాలని, ప్రజా సమస్యలను గాలికొదిలేయకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి తేదీలతో సహా సమాధానాలు ఇవ్వాలని లేఖలో కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?