KTR: KTR: అసెంబ్లీ జరిగే సమయంలో విధాన పరమైన ప్రకటనలు అసెంబ్లీ ఆవరణలో చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ లాబీ వద్ద చిట్ చాట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ జరిగే సమయంలో విధాన పరమైన ప్రకటనలు బయట చేయొద్దని తెలిపారు. అసెంబ్లీ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బయట మాట్లాడారని తెలిపారు. ఇది ఎంత వరకు సబబు అని స్పీకర్ ను ప్రశ్నించామన్నారు. వారు చేస్తే తప్పుకాదు.. అదేపని మేము చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. ప్లే కార్డులు తేవద్దు అంటున్నారని మండిపడ్డారు. ఫోటోలు తీయొద్దు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే లకు ప్రవేశం లేదు అంటున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే తిరిగేవారని కేటీఆర్ గుర్తుచేశారు.
Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..
2009-14 వరకు అసెంబ్లీలో తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న పరాజితం.. ఒడిపోయాన కాంగ్రెస్ అభ్యర్థులను వేదికలపై కూర్చోబెడుతున్నారని మండిపడ్డారుద. దీనిపై చర్య తీసుకోవాలని కోరామన్నారు. లాగచర్ల రైతుల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. అప్పుల విషయంలో తప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ రూ.3 లక్షల 90 వేళా కోట్లు అంటే, ప్రభుత్వమెమో రూ.6 లక్షల 90 వేళా కోట్లు అంటున్నారని , ఇది తప్పన్నారు. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. ఇది కూడా సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరామని చిట్ చాట్ లో కేటీఆర్ వివరించారు.
Sabitha Indra Reddy: మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం..