NTV Telugu Site icon

KTR : కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు.

Ktr

Ktr

ఫార్మా కంపెనీ కడితే కట్టు… లేకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరిగి భూములను ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు అమలు చేయండని అన్నారు. కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని, అవినీతి ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేద్దామన్నారు. బతుకమ్మ చీరలు,రుణమాఫీ కాలే ఈ సారి దసరా పండుగ దసరా లాగానే లేదని, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది పరిస్థితి అని కేటీఆర్‌ మండిపడ్డారు. రెండు పంటలకు కాదు మూడు పంటకు రుణమాఫీ అన్నాడు…ఇప్పుడు ఒక్క పంటకే ఇవ్వలేదని, నాట్లకు కాదుగా కోతలకు కూడా రైతులకు 10 వేలు కూడా వేయకుండా పోయిందన్నారు. రైతుల తరపున పోరాటం చేస్తుంది మేము అని, మిగతా పార్టీలు ఇబ్రహీంపట్నం లో కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందిని ప్రశ్నించారన్నారు.

Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

అంతేకాకుండా..’రిజర్వేషన్ కోటలో అవకతవకలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడినం,ఈ చిన్న నాయకులతో కొట్లాడడం మాకు కొత్త కాదు. పండుగలకు ఎలాంటి తోఫాలు ఇవ్వలేదు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పింఛన్ ఇస్తా అని హామీ ఇచ్చి నెరవేర్చే లేదు. అడిగితే ఉచిత బస్సు లని అనడం ఎండని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మంచిపని చెప్పలని అన్నారు. నేను గుంపు మెస్ట్రీ అని చూపిన రేవంత్…. కూల్చే మేస్త్రీ అయింది. కాంగ్రెస్ పార్టీని అన్ని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి… ఈ రాష్ట్రం కేసీఆర్ ను కోరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో, బడులలో కనీస సౌకర్యాలు తీర్చడానికి డబ్బులు లేవు. మూసీ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడం ఏంటని అడిగారు. మా ఇండ్లు కూర్చు….ఒప్పుకుంటాం.. పేదల ఇండ్లు కూర్చకు. 2015లో ఫార్మా సిటీ ఏర్పాటు కు శ్రీకారం చుట్టడం జరుగింది…14వేల ఎకరాలు సేకరించడం జరిగింది. ఫార్మా సిటీ లో భూములు కోల్పోయిన రైతులకు భూములు తిరిగి ఇయ్యాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూముని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. రాష్ట్రంలో సకల జనుల ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ‘ అని కేటీఆర్‌ అన్నారు.

Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు