KTR: మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి స్వల్ప ఓటింగ్ తేడా తో బీఆర్ఎస్ ఓటమి అన్నారు. 14 సీట్ల లో ఓటమి పాలు అయ్యం అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ఉదరకొట్టింది కాంగ్రెస్ అన్నారు. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ చూపించింది.. అధికారం శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎవ్వరో ఒక్కరి దిగి పోవాల్సిందే అన్నారు. ఉద్యమ కారులకు దూరం అయ్యామన్నారు. దేశంలో ఎక్కడ చేయనంత ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.
రెండు లక్షల ఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ కృషి వుందన్నారు. 2014 నుంచి 24 వరకు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. లెక్కలతో సహా వివరాలు ఇస్తాం ఆ సత్తా మాకు వుందన్నారు. ఇంత కంటే గొప్పగా ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఎక్కడన్నా వుందా అంటే కాంగ్రెస్ బీజేపీ ల నుంచి సమాధానం లేదన్నారు. ఇంత చేసిన సోషల్ మీడియా లో దుష్ప్రచారం జరిగిందన్నారు. యువత సోషల్ మీడియా కు ఆకర్షితులు అయ్యారని మండిపడ్డారు. మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Kajal Aggarwal : ఆ సినిమా కోసం ఎంతో బాధను అనుభవించాను..
మహబూబాబాద్ , కొత్తగూడెం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం తో పాటు మెడికల్ కళాశాల ఇచ్చామన్నారు. తెలంగాణ లో 65 ఏళ్ళ లో మూడు మేదికల కళాశాలలు, బీఆర్ఎస్ ప్రభుత్వం 33 మెడికల్, నర్సింగ్ కళాశాల లు ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ లో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడడం లేదన్నారు. ఓట్లేసే టప్పుడు రేవంత్ రెడ్డి కి రైతు బంధు గుర్తుకు వస్తోందన్నారు. ఆరు నెలలు గడిచిన రైతు బందు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు కావాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించేవి కాదన్నారు. ప్రభుత్వానికి చెక్ వుండాలి.. ఆ చెక్ రాజ్యసభ, శాసనమండలి..ప్రభుత్వానికి మంద బలం వుందన్నారు.
15 వెలు రైతు బంధు రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.. ఇప్పటి వరకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్ళ ను చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీ లో ఒక్క గ్యారంటీ మాత్రమే అమలు చేశారన్నారు. ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలు, మొగ వాళ్ళు తిట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి కర్రు కాల్చి పెట్టాలన్నారు. ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోవద్దన్నారు. ఒక్క నోటిఫికేషన్. ఇవ్వకుండా పరీక్ష పెట్టలేదు… ఎలా ఉద్యోగాలు ఇచ్చావు రేవంత్ రెడ్డి అన్నారు.
పురుషులు ఇది తింటే నపుంసకత్వం లక్షణాలు..?