సోయాబీన్‌ను శాఖాహార మాంసం అంటారు. అనేక పోషకాలతో నిండివున్న ఆహారం అని చెప్పవచ్చు.

పురుషులు మాత్రం సోయాబీన్స్ తరుచుగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఈస్ట్రోజెన్ హార్మోన్ శాతం ఎక్కువ.

అధికంగా తీసుకోవడంవల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. దీనివల్ల లైంగిక నపుంసకత్వం వంటి లక్షణాలు వస్తాయి. 

సోయాబీన్స్‌లో సైటోస్టోజెనెస్ అనే రసాయనం ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది.

ఇది పురుషుల హార్మోన్లపై చెడు ప్రభావం చూపడంతోపాటు లైంగిక శక్తిని తగ్గిస్తుంది. ఛాతీ, పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. 

వీటిని దృష్టిలో ఉంచుకొని పురుషులు సోయాబీన్స్ అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పురుషులు రోజుకు 70 గ్రాముల సోయాబీన్స్ తినవచ్చు. 

మహిళలు వారానికి 3 రోజులు 30 నుండి 50 గ్రాముల సోయాబీన్స్ తినవచ్చు. చేపలు-మాంసం-గుడ్ల కంటే సోయాబీన్ ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రొటీన్లకు మూలం. 

ఎముకలు బలపడటంతోపాటు కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ ఇ, మినరల్స్, అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. అలాగే రక్తపోటు నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. 

థైరాయిడ్ ఉన్నవారు అసలు సోయాబీన్స్ తినకూడదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడంవల్ల థైరాయిడ్ పెరుగుతుంది. 

జీర్ణ సమస్యలతోపాటు మలబద్ధకం, విరేచనాల ప్రమాదాన్ని సోయాబీన్స్ పెంచుతాయి. అధికంగా తీసుకుంటే అలర్జీలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.