Site icon NTV Telugu

KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్‌

Ktr

Ktr

KTR : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్‌ఎస్‌ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్తి ఆధారాలతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇచ్చానని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 లక్షల 75 వేల ఓటర్లు ఉండగా.. ఇప్పుడు 3 లక్షల 98 వేల ఓట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

ఏపీ కల్తీ లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు..! వేడెక్కిన జోగి రమేష్, జనార్ధన్ రావు వివాదం

అంతేకాకుండా.. అసాధారణంగా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని, మొన్న కాంగ్రెస్ పార్టీ తరుపున నవీన్ యాదవ్ ఓటర్ ఐడి లు పంచాడని, ఓటర్ ఐడీ పంచే అధికారం అతనికి ఎవరు ఇచ్చారని ఆయన అన్నారు. అవన్నీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డ్స్ అని ఎన్నికల అధికారులు అంటున్నారన్నారు. అతనిపై ఎన్నికల అధికారులు కేసు కూడా నమోదు చేశారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా ఉన్నారని కేటీఆర్‌ వెల్లడించారు. సంస్కృతి ఆపాట్మెంట్ లో 43 ఓటర్లు ఉన్నారని, కానీ అక్కడికి వెళ్లి ఎంక్వయిరి చేస్తే.. వాళ్లెవరు అక్కడ లేరని చెబుతున్నారన్నారు. ఇదేకాకుండా.. మరొక చోట బూత్ నెంబర్ 125 లో ఒకటే అడ్రెస్స్ లో 23 ఓట్లు ఉన్నాయని, అక్కడ కూడా ఈ 23 మంది ఎవరో అక్కడి వాళ్లకు తెలియదు అని చెబుతున్నారన్నారు. ఆ ఇంటి యజమానికి కూడా వాళ్లెవ్వరో తెలియదు అని సమాధానం ఇస్తున్నారన్నారు. ఇవ్వన్నీ ఫేక్ ఓట్లు అని కేటీఆర్‌ అన్నారు. 118 ఇంటి నెంబర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటి అడ్రస్‌పై 32 ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Siddu Jonnalagadda: అందరిలా కాదు.. మా ట్రైలర్ కంటెంట్ అంతా సినిమాలోనూ ఉంటుంది!

Exit mobile version