Site icon NTV Telugu

KTR: మోడీ క్షమాపణ చెప్పాల్సిందే..!

రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం వచ్చారు.. పచ్చని పొలాలను చూసి మోడీకి కడుపు మంట అని మండిపడ్డారు కేటీఆర్… గుజరాత్ కంటే అభివృద్ధిలో తెలంగాణ ముందుకు పోతుందని విషం చిమ్మారన్న ఆయన.. గుండెళ్లో గునపాలు దింపెలా మాట్లాడారని.. అమరవీరుల త్యాగాలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Mohan Bhagwat: హిందూ ధర్మ హితమే.. .రాష్ట్ర హితం..

Exit mobile version