KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్‌లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక బుల్డోజర్ కావాలా?” అని ఆయన అన్నారు.
“ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగేవి కావు. ఇది ప్రజల గౌరవం కోసం జరుగుతున్న పోరాటం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు. పార్లమెంట్‌లో చేసే పనిని అసెంబ్లీలో చేస్తే చెల్లదని ఆయనకే తెలుసు. ఆజారుద్దీన్‌కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా కోర్టులో నిలవదు. అతనినీ మోసం చేశాడు. తెలిసి తెలిసి మోసం చేయడమే రేవంత్ పాలసీ,” అని కేటీఆర్ అన్నారు.
అంతేకాదు, కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా గుప్పించారు. “ఈ రెండేళ్లలో వాళ్లు ఫుల్‌గా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఓటుకు పది వేల రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి. పువ్వు గుర్తుకి అసలు ఓటు వేయొద్దు — అది పూజకు పనికిరాని పువ్వు లాంటిది,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని, రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..
