KTR: అబద్దమైతే నిరూపించండి..? బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు కేటీఆర్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: నేను చెప్పేది అబద్ధం అని బండి సంజయ్, కిషన్ రెడ్డి లేదా.. బీజేపీ పార్టీవాళ్ళు ఎవరైనా నిరూపిస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉదయం సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ లోనీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా.. అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం పలు వార్డులలో ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్ పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. పన్నులు వేస్తే, ట్యాక్స్ లు వసూలు చేస్తే రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వలసి వస్తుందని సెస్ పేరుతో వసూల్ చేసాడు మోడీ అన్నారు.
Read also: Yadadri: అకాల వర్షం అపార నష్టం.. తడిసిన ధాన్యంతో రైతన్న ఆగమాగం..
Also Read
పెట్రోలు, డీజిల్ పై సెస్ ల రూపంలో పైసలు వసూలు చేసి రహదారులు వేస్తామని పేదల రక్తం పీల్చి 30 లక్షల కోట్లు దండుకున్నాడన్నారు. దోచుకున్న 30 లక్షలు కోట్ల రూపాయలను 14 లక్షల కోట్లు ఆదాని అంబానీలకు పంచిపెట్టాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పేది అబద్ధం అని బండి సంజయ్ కిషన్ రెడ్డి లేదా బీజేపీ పార్టీవాళ్ళు ఎవరైనా నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. అబద్ధం అని నిరూపిస్తే రేపు తెల్లారే సరికి సిరిసిల్ల కొత్త బస్టాండ్ దగ్గర తెలంగాణ తల్లి సాక్షిగా నా రాజీనామా చేసి వారి మోఖానికి కొడుతా అంటూ సవాల్ విసిరారు.
Read also: Indian 2 : ఇండియన్ 2 ఫైనల్ రిలీజ్ డేట్ అదేనా..?
నేత కార్మికుల కోసం 3 వేయిక కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నామన్నారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి మందు పంచలేదు.. మీరు నాకు ఇచ్చిన దయ.. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల నే అన్నారు. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నామన్నారు. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది. మోచేతికి బెల్లం పెట్టీ మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు. ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టిండన్నారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి? అని ప్రశ్నించారు.
Read also: Sunita Williams : మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్..
అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచలో ఒక్క నిమిషాల్లో దొరికిపోయారన్నారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, భుతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరన్నారు.
Delhi : రాజధానిలో 15000 కిలోల నకిలీ మసాలా దినుసులు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!