KP Vivekanand: మహిళా మంత్రితో కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కె.పి.వివేకానంద గౌడ్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పేరును బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి గా మార్చుకోవాలన్నారు. కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోయిందని అసత్య ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. కేటీఆర్ బామ్మర్ధి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. మహిళా మంత్రితో కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయించారన్నారు.
Read also: Student Suicide: హైదరాబాద్‌లో విషాదం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
లగచర్ల లో రైతులు తిరుగుబాటు చేస్తే కేటీఆర్ పేరు ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ఎట్లా అరెస్టు చేయాలని క్యాబినెట్ లో చర్చించారన్నారు. రాష్ట్ర ప్రజల గురించి క్యాబినెట్ లో చర్చ జరగలేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. బాంబుల శాఖా మంత్రి దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామన్నారు. గవర్నర్ నుండి పర్మిషన్ వచ్చింది అని సంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో స్పష్టం చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేయలేదని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ మానుకోవాలన్నారు.
Tiger in Mulugu: భద్రాద్రి నుంచి మళ్లీ ములుగులోకి ప్రవేశించిన పెద్ద పులి..