Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- ‘కుండబద్దలు కొడితే తట్టుకోరు’
- పదవి ఉన్నా లేకున్నా గౌరవమే
- ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నాం
- రాజకీయ దాడులకు ఎదురెళ్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్టుగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తమకు కొత్తేమీ కాదని, అయితే అలాంటి మాటలను ప్రతి ఒక్కరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. పదవులు శాశ్వతం కాదని కొండా మురళీ అన్నారు. ఇవాళ తాము పదవుల్లో ఉండొచ్చని, రేపు మరొకరు ఆ స్థానాల్లో ఉండొచ్చని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తమ గౌరవం తమకు ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
తాము ప్రతిదానికీ వెంటనే స్పందించకపోవచ్చని, అయితే జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటామని కొండా మురళీ అన్నారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని పరోక్షంగా హెచ్చరించారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులపై ఆయన ఘాటుగా స్పందిస్తూ.. ‘‘అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్న, చేసిన రాజకీయ దాడులకు దృఢంగా నిలబడతాం. మొండిగా ఎదురు వెళ్లగలం’’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లను వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!