Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- అమరవీరులను అవమానిస్తే సహించం: కోమటిరెడ్డి
- పవన్ వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం
- ఆంధ్రా కాంట్రాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు
- ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రమంతా సంబురాలు జరుపుకుంటున్న పవిత్రమైన రోజున, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇక్కడి గడ్డపై నిలబడి తన అక్కసు వెళ్లగక్కడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్‌కు అణువణువునా ఉన్న ద్వేషం, వివక్ష ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ‘మీ అయ్య జాగీరా’ అంటూ వాడిన భాష చూస్తుంటే తమ రక్తం మరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వేలాది మంది అమరవీరులను ఘోరంగా అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము మంత్రి పదవులను సైతం త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన చరిత్ర గలవాళ్లమని గుర్తుచేశారు. ప్రస్తుతం టీడీపి, బీజేపీలు కలిసి జట్టుగా చేరి తెలంగాణపై మళ్లీ కొత్త కుట్రలు చేస్తున్నాయనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
“ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఎవరూ అడ్డుకోరు. కానీ తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం అస్సలు సహించేది లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ఇక్కడి అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఆ తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు పవన్ కళ్యాణే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వబోమని, అవసరమైతే దీని కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికైనా ప్రభుత్వం వెనకాడబోదని మంత్రి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ఎంతకైనా తెగిస్తామని తేల్చిచెప్పారు.
ఆరుసార్లు చట్టసభలకు ఎన్నికైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్‌కు ఒక మంచి సలహా ఇస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, తెలంగాణలో రాజకీయ విద్వేషాలు రేపడం మానేసి తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. రెండు తెలుగు ప్రాంతాలు అభివృద్ధిలో పోటీపడాలి తప్ప, ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతూ.. “తస్మాత్ జాగ్రత్త” అని హెచ్చరించారు.
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!