Komatireddy Venkat Reddy: సీఎం స్పందించకపోతే.. రక్తపాతం తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Gives Serious Warning To CM KCR: నల్లగొండ జిల్లాలోని సమస్యలపై సీఎం స్పందించకపోతే.. రక్తపాతం తప్పదంటూ ఎంపీ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ప్రజలను, ముఖ్యంగా రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. 246 జీవోను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతోన్నా.. ఎల్ఎల్‌బీసీకి సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించలేదన్నారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయకుండా.. లక్షలు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మాణాన్ని పూర్తి చేశారని మండిపడ్డారు.
కృష్ణా నది నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకు 8 నుండి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకోకపోతే.. నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్‌బీసీ నిరుపయోగంగా మారుతుందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్ నోరుమీదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్‌ను తమ కాంగ్రెస్ పార్టీ రూపు మాపిందని.. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రాజెక్ట్‌లపై, రైతు సమస్యలపై, కరెంట్‌పై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ కాలువల నిర్వహణపై ఉన్న శ్రద్ధ.. దక్షిణ తెలంగాణలో ఏమాత్రం లేదని దుయ్యబట్టారు. జిల్లా రైతుల కోసం తాను దీక్ష చేపడతానని.. అది ఆమరణ దీక్షా లేక నిరవధిక దీక్షా అనేది వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
సాగునీటి కోసం మండలి ఛైర్మన్ ఎందుకు నోరు మెదపడం లేదని కోమటిరెడ్డి ప్రశనించారు. కృష్ణా నది కేటాయంపులను వాడుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని సెటైర్లు వేశారు. తాను త్వరలోనే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటానని, ఆయనతో అన్ని విషయాలూ చర్చిస్తానని అన్నారు. ఒకవేళ ఆయన నుంచి సరైన స్పందన లేకపోతే.. ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు.. సీఎం స్పందిచకపోతే రక్తపాతం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!