Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komatireddy Venkat Reddy Challenges Cm Kcr

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కి కోమటిరెడ్డి సవాల్.. ఆ దమ్ముందా?

Published Date :July 19, 2023 , 9:08 pm
By NTV WebDesk
Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కి కోమటిరెడ్డి సవాల్.. ఆ దమ్ముందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Komatireddy Venkat Reddy Challenges CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఓ సవాల్ విసిరారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు కోమటిరెడ్డి ఇంట్లో హాజరయ్యారు. ఈ సమావేశంలో విడతల వారీగా బస్సు యాత్ర చేయాలని, జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. యుద్ధానికి (తెలంగాణ ఎన్నికలకు) మరో 100 రోజులే ఉన్నాయని, ఈ యుద్ధంలో తాము గెలవాలంటే ముందు ప్రజలు గెలవాలని అన్నారు. తాము కేసీఆర్‌లాగా వంద హామీలు ఇవ్వమని.. ఐదు కీలక అంశాలు చెప్తామని.. ఇంటింటికీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు.

MP Vijayasai Reddy: విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

తమ నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి ముందుకు సాగుతామని కోమటిరెడ్డి తెలిపారు. ఏ నిర్ణయమైనా ఇక పీఏసీలో చర్చించాలని అన్నారు. ఈనెల 23న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుందని, అలాగే ఈనెల 30వ తేదీన ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ ఉండనుందని చెప్పారు. కాంగ్రెస్ నేతలమంతా స్ట్రాటెజీ రోడ్డు మ్యాప్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేవలం ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని.. అందులో 40 శాతం కమిషన్ నొక్కుతున్నారని ఆరోపించారు. తాను లాగ్‌బుక్‌ను బయటపెట్టాక గానీ పలు ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పేదల భూములను సైతం లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నియంత పాలన నుండి విముక్తి కలిగించడం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఉద్ఘాటించారు.

Niranjan Reddy: వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక విగ్గు రాజా అని, ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ఇప్పుడే పూర్తిగా చెబితే, సీఎం కేసీఆర్ ఇప్పుడే ప్రగతి భవన్‌ను ఖాళీ చేస్తారని వ్యాఖ్యానించారు. తాము జనంలోకి వెళ్లి, అన్ని చెప్తామన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అసలు రేవంత్ రెడ్డిపై ధర్నా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. పీసీసీని ఇష్టమొచ్చినట్టినట్టు తిడితే ఊరుకునేది లేదని.. మీరొకటి తిడితే, తాము వంద తిడతామని చెప్పుకొచ్చారు.

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్.. 5 బిల్లులకు ఆమోదం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Komatireddy Venkat Reddy
  • Priyanka Gandhi
  • telangana elections
  • Telangana Politics

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions