Komatireddy Venkat Reddy Challenges CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఓ సవాల్ విసిరారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు కోమటిరెడ్డి ఇంట్లో హాజరయ్యారు. ఈ సమావేశంలో విడతల వారీగా బస్సు యాత్ర చేయాలని, జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. యుద్ధానికి (తెలంగాణ ఎన్నికలకు) మరో 100 రోజులే ఉన్నాయని, ఈ యుద్ధంలో తాము గెలవాలంటే ముందు ప్రజలు గెలవాలని అన్నారు. తాము కేసీఆర్‌లాగా వంద హామీలు ఇవ్వమని.. ఐదు కీలక అంశాలు చెప్తామని.. ఇంటింటికీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు.
MP Vijayasai Reddy: విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
తమ నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి ముందుకు సాగుతామని కోమటిరెడ్డి తెలిపారు. ఏ నిర్ణయమైనా ఇక పీఏసీలో చర్చించాలని అన్నారు. ఈనెల 23న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుందని, అలాగే ఈనెల 30వ తేదీన ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ ఉండనుందని చెప్పారు. కాంగ్రెస్ నేతలమంతా స్ట్రాటెజీ రోడ్డు మ్యాప్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేవలం ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని.. అందులో 40 శాతం కమిషన్ నొక్కుతున్నారని ఆరోపించారు. తాను లాగ్‌బుక్‌ను బయటపెట్టాక గానీ పలు ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పేదల భూములను సైతం లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నియంత పాలన నుండి విముక్తి కలిగించడం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఉద్ఘాటించారు.
Niranjan Reddy: వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక విగ్గు రాజా అని, ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ఇప్పుడే పూర్తిగా చెబితే, సీఎం కేసీఆర్ ఇప్పుడే ప్రగతి భవన్‌ను ఖాళీ చేస్తారని వ్యాఖ్యానించారు. తాము జనంలోకి వెళ్లి, అన్ని చెప్తామన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అసలు రేవంత్ రెడ్డిపై ధర్నా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. పీసీసీని ఇష్టమొచ్చినట్టినట్టు తిడితే ఊరుకునేది లేదని.. మీరొకటి తిడితే, తాము వంద తిడతామని చెప్పుకొచ్చారు.
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్.. 5 బిల్లులకు ఆమోదం