Komatireddy Venakt Reddy : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్యాలగూడ పట్టణంలో టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టాడని ఆయన ఆరోపించారు.
ప్రజాదరణ, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి.. సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు పనులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు తన బంధువులైన పోలీస్ అధికారులను తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!