నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్ మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈఎనిమిదిన్నరేళ్లలో మనుగోడుకు సర్కారు ఒక్కరూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. అందుకు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సీఎం కేసీఆర్ మునుగోడుకి రావాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో., మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా సమక్షంలో భారీగా చేరికలున్నాయని, అందుకు భయపడే.. కేసీఆర్ రేపు సభ ఏర్పాటు చేసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ ఆరోపించారు. నిధులు ఇవ్వని సీఎం, మునుగోడు ఎలా వస్తారని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి’ఎనిమిదిన్నరేళ్లలో మనుగోడుకు సర్కారు ఒక్కరూపాయి ఇవ్వలే. నిధులు ఇవ్వని సీఎం మునుగోడు ఎలా వస్తారు?ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సీఎం కేసీఆర్ మునుగోడుకి రావాలి. ఈనేపథ్యంలో.. 21న మునుగోడులో అమిత్‌షా సభ ఉంటుందని నెల ముందే చెప్పాం. కావాలనే కుట్రపూరితంగా సీఎం కేసీఆర్ రేపు సభ పెట్టారని ఆరోపించారు.
Chandoo Mondeti : అమితాబ్ బచ్చన్‌తో ‘కార్తికేయ’ దర్శకుడు..