NTV Telugu Site icon

Komaram Bheem: నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..

Komaram Bheem

Komaram Bheem

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి చౌదరి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణమని చేస్తూ.. నేడు బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలే ఏం జరిగిందంటే..

ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి.శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్‌లో మృతిచెందింది. శైలజ వాంకిడి గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థిని. అక్టోబర్ 31న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో రాత్రి భోజనం చేసి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన 63 మందిలో శైలజ ఒకరు. తీవ్ర అస్వస్థత కారణంగా శైలజతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినప్పటికీ ముగ్గురు విద్యార్థులు కోలుకోకపోవడంతో, నవంబర్ 5న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హైదరాబాద్‌కు తరలించారు. శైలజ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అనేక సార్లు అతిసారంతో బాధపడింది.

అయితే శైలజతో వున్న మిగతా ఇద్దరు విద్యార్థినులు కోలుకోగా.. శైలజ పరిస్థితి విషమంగానే ఉండటం కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ నవంబర్ 5 నుంచి నవంబర్ 9 వరకు డయాలసిస్, వెంటిలేటర్ సపోర్టుపైనే ఉండాల్సి వచ్చింది. నవంబర్ 11న, సోమవారం మరణించే వరకు ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచారు. శైలజ మృతదేహాన్ని తల్లిదండ్రులు మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలోని స్వగ్రామంలో ఉద్రికత్తల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇవాళ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కొమురం భీం జిల్లాలోకి అనుమతించడం లేదు. ఎక్కడ చూసి పోలీసులు భారీగా మోహరించారు.
Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరనేది నేడు తేలనుంది..?