Komaram Bheem: తెలంగాణ సరిహద్దు దాటిన మరో పులి..
- తెలంగాణ సరిహద్దు దాటిన మరో పులి..
- కెరమెరి, వాంకిడి మండలాల్లో వారం రోజులు గా సంచరిస్తున్న పులి..
- మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్టు ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ రెండు పులుల్లో ఒకటి మగ పులి జానీ తాజాగా మహారాష్ట్రకు వెళ్లిపోయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు పులుల్లో ఒక పులి అయితే వెళ్లిపోయింది సరే.. మరో పులి జాడ ఏమైంది? అన్నట్లు ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు రెండో పులి జాడ కోసం చర్యలు చేపట్టారు. అయితే మరో పులి కూడా తెలంగాణ సరిహద్దు దాటినట్లు ఇవాళ అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. కెరమెరి, వాంకిడి మండలాల్లో వారం రోజులుగా సంచరిస్తున్న పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్టు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వాంకిడి మండలంలోని ధాబా గ్రామ అటవీ ప్రాంతంలో ఆవుల మంద పై పులి దాడి చేసినట్లు గుర్తించారు. వాంకిడి మండలంలోని గోయేగాం గ్రామం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారి పక్కన పులి సంచార ఆనవాళ్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం పులి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించారు. పులి ప్రస్తుతం మహారాష్ట్రలోని కొస్తాడా అటవీ ప్రాంతంలో వెళ్లిపోయిందని, అక్కడ పశువుపై దాడి కూడా చేసిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా మగ పులి జానీ వెళ్లిపోగా ఇప్పుడు మరో పులి సైతం రాష్ర్ట సరిహద్దు దాటినట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇన్ని రోజులు పులి సంచారంతో భయాందోళన చెందిన ఆసిఫాబాద్ ప్రజలు పులి వెళ్లి పోయిందనే సమాచారంతో ఆనందం వ్యక్తం చేశారు.
Mahabubabad: మాల ధరించిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా.. తొర్రూరులో స్వాముల ఆందోళన..
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!