Site icon NTV Telugu

CM Revanth Reddy : కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్యాకేజ్

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పట్టణాభివృద్ధి నుంచి విద్య, సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ పనులు ప్రారంభమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా, నియోజకవర్గంలో మొత్తం 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ.5.83 కోట్లు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.5.01 కోట్లు కేటాయించారు. గ్రామీణ పరిపాలనను బలోపేతం చేసేందుకు 10 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చించనున్నారు. బంజారా భవన్‌లో అదనపు సౌకర్యాల కోసం కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణకు కలిపి రూ.3.65 కోట్లు మంజూరు చేశారు.

Tirumala: డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. టోకెన్లు కావాలంటే..!

కొడంగల్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1 కోటి, అగ్నిమాపక కేంద్రానికి రూ.1.30 కోట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ.1.40 కోట్లు కేటాయించారు. అలాగే కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ.4.91 కోట్లు, సీసీ రోడ్లు , భూగర్భ డ్రైనేజ్ (UGD) వ్యవస్థ అభివృద్ధికి రూ.4.45 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభోత్సవం కూడా ఈ సందర్భంగా జరిగింది, వీటి కోసం రూ.2.95 కోట్లు వెచ్చించారు.

కొడంగల్ పట్టణ అభివృద్ధి దిశగా అత్యంత కీలకంగా పరిగణిస్తున్న రోడ్డు విస్తరణ పనులకు ఒక్కటే రూ.60 కోట్లు కేటాయించగా, కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రూ.4.50 కోట్లు మంజూరు చేయడం రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఈ మొత్తం ప్రాజెక్టులు కొడంగల్ నియోజకవర్గపు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడంలో పెద్ద అడుగుగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Akhanda 2 Thandavam :అఖండ2లో బాలయ్య విశ్వరూపం..ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌కి గూస్‌బంప్స్!

Exit mobile version