Kishan Reddy: సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ పదేళ్ళలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. జాతీయ రహదారులు, పేదలకు ,బియ్యం, పిఎం కిసాన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారన్నారు.
ఈ పదేళ్ళలోనే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి మయ పాలన చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ ఏ పథకాలు చూసిన అవినీతే అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ప్రజలు తలదించుకునేలా లిక్కర్ స్కామ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Cherlapalli Railway Station: చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్.. శరవేగంగా టెర్మినల్ పనులు..
వారి తర్వాత పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలం అయిందన్నారు. తెలుగు ప్రజల కోసం మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు భాష నేర్చుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంతో బిజీగా ఉన్నా… తెలుగు నేర్చుకుంటున్నారు.. మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాటలు చెప్పడంలో కేసీఆర్ ను రేవంత్ మించి పోయాడని మండిప్డారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు జరుగుతున్నాయి అంటున్నాడు రేవంత్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వాన్ని మేమేమి కూలగొట్టం అన్నారు. ఎవరైనా కూలగొడితే మేము కాపాడలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Election 2024: మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ