Kishan Reddy: పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పెట్రోల్, డీజిల్ ధరలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉందని తెలిపారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలతో.. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో 13 రూపాయలు ఎక్కువగా ఉందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ పైఅత్యధిక వ్యాట్ తెలంగాణలో విధిస్తున్నారని అన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల ప్రపంచంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అన్నారు. ప్రజలకు భారం పడొద్దని వ్యాట్ తగ్గించాలని కేంద్రం ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. దేశంలో 23 రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయని, 69,190 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్ పై తెలంగాణ కు ఏడాదికి 4,527 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి 13170 కోట్ల ఆదాయం వస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. అదనపు భారం పడుతున్నా కేంద్రం పన్నులు పెంచటం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మల్లిస్తున్నారని ఆరోపిస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Read also: KTR: కామారెడ్డి ఇష్యూ పై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం సిపారస్ మేరకు నిధులు విడుదల చేసిందని అన్నారు. పంచాయితీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం, సిబ్బంది జీతాలు.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గద్దల్లా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. బ్యాంకుల్లో పడ్డ డబ్బుల్ని గంటలోనే దారి మళ్లించారని ఆరోపించారు. డబ్బులు పడ్డ మెసేజ్ చూసి సర్పంచులు బ్యాంకులకు వెళ్తే అప్పటికే దారి మళ్లించారని అన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకంలోనూ నిధులు దారి మళ్లించారని ఆరోపణలు గుప్పించారు. కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు నిరసన కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా వంట నూనెల కోసం ప్రత్యేక పథకం రూపొందించారని అన్నారు. ఆయిల్ ఉత్పత్తులను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకొందని తెలిపారు. 2025 నాటికి 12 లక్షల టన్నులు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ కోసం తెలంగాణ కు 114 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం చెల్లించిందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి చెప్పింది అబద్ధం, మాకు ఒక్క రూపాయి రాలేదని వక్ర భాష్యం చెప్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
Hardik Pandya: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన హార్దిక్.. భారత క్రికెట్ చరిత్రలో తొలి కెప్టెన్
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!