Kishan Reddy : సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి బస్తీ బాట
- అధికారులను వెంటబెట్టుకొని బస్తీల్లో పర్యటన
- పేదల సంక్షేమం, స్థానిక సమస్యలపై దృష్టి
- సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ వాసులతో కలిసి గల్లీల్లో కలియ తిరిగారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బస్తీల్లో జనాభా వేగంగా పెరుగుతోందని, ప్రతిరోజూ కొత్త కాలనీలు, కొత్త అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి నగర స్వరూపమే మారిపోతోందని వ్యాఖ్యానించారు.
150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజించి, ఒక్క కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా చేయడం వెనుక భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే అక్కసే కారణమని ఆరోపించారు. హైదరాబాద్ కోర్ సిటీని మజ్లిస్ పార్టీకి అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని విమర్శించారు.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
హైదరాబాద్‌కు తగినంత నీటిని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎండాకాలం మొదలవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండాకాలం మొదలు ముందే హైదరాబాద్‌లో వర్షపు నీటి కాలువల్లో యుద్ధప్రాతిపదికన సిల్ట్ తొలగించాల్సి ఉండగా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పేపర్ల మీద మాత్రం కాంట్రాక్టర్లు సిల్ట్ తీసినట్లు చూపించి, చెల్లింపులు చేసుకున్నారని ఆరోపించారు.
బస్తీల్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికను కూడా తొలగించడం లేదని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తెలిపారు. హైదరాబాద్ ప్రజల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఉందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ పాలకవర్గం రద్దయిన నేపథ్యంలో, ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, అధికారులతో కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా తాను నిరంతరం కృషి చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం.. కవితకు క్లీన్ చిట్
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!