Kidnapping in Jagityala district: తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. రెండు రోజులు కొకసారి చిన్నారు కిడ్నాప్ కేసులు పెరుగుతుండటంతో పోలీసులకు సవాల్ గా మారింది. జగిత్యాల జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొందరు దుండగులు బాలికను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమయ్యారు. దీంతో జగిత్యాల జిల్లాలో జరిగిన ఈఘటన సంచలనంగా మారింది.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
జగిత్యాల రూరల్ మండలం దరూర్ పట్టణంలోని సాయి జనతా గ్యారేజ్ కోటి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారికి సాయి లహరి 12సంవత్సరాల బాలిక 7వ తరగతి చదువుకుంటుంది. పని నిమిత్తం బయటకు వచ్చిన బాలికను కొందరు దుండగులు అక్కడకు కారులో వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడం బాలిక ఒక్కటే అక్కడ వుండటం గమనించిన నలుగురు దుండగులు ఆ బాలికను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇరుగు పొరుగు వారిని అడిగిన, తెలియదనే సమాధానం చెప్పడంతో.. తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. కిడ్నాప్ కు గురైన బాలిక కారులో బంధించి నలుగురు దుండగులు ఫోన్ లో మాట్లాడుతుండటంతో.. బాలిక లహరి చాకచక్యంగా కారులో నుంచి కిందికి దూకేసింది. అక్కడనుంచి పరుగులు పెట్టింది. వారి వద్దనుంచి తప్పించుకుని బయటపడింది. అక్కడ కొందరు స్థానికులను చూసి వారి వద్దనుంచి తండ్రికి ఫోన్ చేసింది. స్థానికుల సహాయంతో తండ్రి ఇంటికి చేరింది లహరి. ఈఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగిత్యాల రూరల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Pragya Thakur: వివాదాస్పద బీజేపీ ఎంపీపై కేసు.. సాధ్వి ప్రజ్ఞాపై కాంగ్రెస్ ఆగ్రహం
బాలికను ఎందుకు ఎత్తుకెళ్లారు అన్నదాని పైన విచారిస్తున్నారు. పట్టణంలోని సాయి జనతా గ్యారేజ్ లోలహారి తండ్రి కోటి మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రిపై కోపంతో కూతురిని కిడ్నాప్ చేశారా? లేక అమ్మాయి పరిచయస్తులు ఎవరైనా, లేక కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్ద వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటే తెలిసిన వారైనా ఉండాలి? బాలిక ఒంటరిగా వెలుతున్నట్లు గమనించారంటే ఆమెను ముందునుంచి ఫాలో అవుతున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నలుగురు యువకులు ఎవరు? ఎక్కడి వారై ఉంటారనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏరియా వారేనా మరెవరైనానైనా.. అనే కోణంలో విచారణ చేపట్టారు. బాలిక లహరి కిడ్నాప్ నుంచి బయట పడటం ఆమె తెలివికి పోలీసులు ప్రసంశించారు. ఇలాంటి వారు ఎవరైనా బాలికలపట్ల వ్యవహరిస్తే చాకచక్యంగా వ్యవహరించాలని భయపడకూడదని, ధైర్యం కోల్పోవద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని కోరారు.
Indian Medicine: చైనాలో భారతీయ మెడిసిన్స్‌కు భారీ డిమాండ్.. బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు