Ponguleti : ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
Also Read : Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
45 రోజుల క్రితం వరితో పాటు మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం జరిగింది.. ఖమ్మం జిల్లా పర్యటనలో కేసిఆర్ పర్యటించి నష్టపోయిన రైతులకు పది వేలు రూపాయలు తక్షణమే రిలీజ్ చేస్తానని చెప్పారు.. 45 రోజులు గడుస్తున్న ఆ డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తక్షణమే అంటే కేసిఆర్ దృష్టిలో 6 నెలల నుంచి 9నెలల,లేకపోతే సంవత్సరంమా అంటూ ఆయన ప్రశ్నించారు.
Also Read : Bhatti Vikramarka : తెలంగాణ మోడల్ అంటే ఇదేనా..?
తక్షణం అనే పదానికి కేసిఆరే డేపినేషన్ చెప్పాలి అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి తరలించి 15 రోజులు అవుతుంది.. ఆకాల వర్షాలతో కల్లల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైయి కొట్టుకుపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుంది.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే లోపు కల్లల్లో ఉన్న ధాన్యం వాన దేవుడి రూపంలో భూమి పాలు అవుతుంది అని పొంగులేటి ఆరోపించారు.
Also Read : Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..
ఈ ప్రభుత్వం మాటాలకే పరిమితం తప్పా…చేతల రూపం దాల్చకపోవటం బాధకరంగా ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల గోస, బాధ, ఆవేదన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని ఆయన అన్నారు. తక్షణమే పార్టీలకు అతీతంగా రైతు పండించిన పంటను యుద్ద ప్రతిపాదనగా కొనుగోలు చెయ్యాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాలవర్షం, వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులకు 20 వేల రూపాయల నష్ట పరిహారం తక్షణమే రిలీజ్ చెయ్యాలి.. కళ్ళబొల్లి కబుర్లు కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.