Liquor Supply Stopped: ఖమ్మం జిల్లా వైరాలో రెండు రోజులుగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిపోలకు సంబంధించిన సర్వర్ డౌన్ కావడంతోనే మద్యం అమ్మకాలు నిలిచిపోయినట్లు డీలర్లు చెబుతున్నారు. మరో కారణం ఏంటంటే రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచనున్న నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపి వేశారా? అనే అనుమానం కూడా తలెత్తుతున్నాయి. రెండు రోజులుగా సుమారు రూ.10 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు బంద్ అయినట్లు డీలర్లు వెల్లడించారు.
Read also: Fire Accident: టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
అయితే.. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక లిక్కర్ ధరలు పెంచ్చొద్దని భావించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read also: Puri Jagannadh : ఊహించని హీరోను పట్టేసిన పూరీ జగన్నాథ్
దీంతో మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది.. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ డబ్బు వస్తుంది. ఇక ఆబ్కారీ శాఖకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇక.. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అయితే.. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో.. ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది.
Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 30 మంది మృతి