Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
- 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- 500 మంది ట్రాఫిక్ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ
- మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ వినియోగించాలని సూచన
- ఐమాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ పార్కింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ స్తంభించకుండా, భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా 500 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించినట్లు ఆయన తెలిపారు.
నాలుగు ప్రత్యేక మార్గాలు , రవాణా సూచనలు
భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా నాలుగు వేర్వేరు మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. వీఐపీల కోసం ప్రత్యేక రూట్‌ను కేటాయించగా, మెట్రో స్టేషన్ నుంచి దిగి వచ్చే భక్తులు నేరుగా దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రం కాకుండా ఉండాలంటే భక్తులందరూ ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో, ఎంఎంటీఎస్ (MMTS), ఆర్టీసీ (RTC) స్పెషల్ బస్సులను ఎక్కువగా వినియోగించుకోవాలని జాయింట్ సీపీ కోరారు. ఒకవేళ సొంత వాహనాల్లో రావాల్సి వస్తే, కుటుంబ సభ్యులు లేదా మిత్రులు కార్ పూలింగ్ పద్ధతిని పాటించి ఒకే వాహనంలో రావడం ద్వారా రోడ్లపై వాహనాల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
Also Read
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
రద్దీ నియంత్రణ , పార్కింగ్ వివరాలు
కేవలం వీకెండ్స్ లేదా సాయంత్రం వేళల్లోనే కాకుండా, సాధారణ రోజుల్లో (వీక్ డేస్) కూడా భక్తులు తమ దర్శన సమయాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మెట్రోలో వచ్చే భక్తులు స్టేషన్ బయట ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఇక వాహనాలతో వచ్చే వారి సౌకర్యార్థం ఐమాక్స్ గ్రౌండ్, హెచ్ఎమ్డీఏ స్థలాలు, ఎన్టీఆర్ పార్క్ వెనుక భాగం, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలలో భారీ పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే బడా గణేష్ దర్శనం అందుబాటులో ఉంటుందని, రాబోయే పది రోజుల పాటు భక్తులందరూ ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!