Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు..

Phone Tapping

Phone Tapping

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్యెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు. కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. కేసీఆర్ ప్రెస్ మీట్ కి ముందు.. ఆ తర్వాత ప్రగతి భవన్ లో రిలీజ్ చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణం లో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Read Also: US-Iran: ఖమేనీతో మర్యాదగా ఉండండి.. ట్రంప్‌‌కు ఇరాన్ వార్నింగ్

అయితే, కేసీఆర్ ప్రెస్ మీట్ లో విడుదల చేసిన పెన్ డ్రైవ్ పై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయనే వివరాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేసి బేరసారాలు ఆడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆడియోలు అన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. కేసీఆర్ మీడియాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ లను సేకరిస్తున్నారు.

Exit mobile version