Site icon NTV Telugu

Governor Tamilisai: బిల్లులను నేను ఆమోదించాలి.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. గవర్నర్ గా తన బాధ్యతను నిర్వర్తిస్తానని తమిళపై తేల్చి చెప్పారు. అయితే.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ పోరు ఇంకా నడుస్తూనే ఉంది. ఇక, రాజ్ భవన్‌కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని.. తనకు ఇవ్వకపోయినా పర్లేదు రాజ్‌భవన్‌కు ఇవ్వాలి కదా.. అంటూ గవర్నర్ తమిళి సై పలుమార్లు కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్, తమిళి సై మధ్య నెలకొన్న విబేధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళి సై వ్యాఖ్యలు చేయడం.. దానికి టీఆర్ఎస్ నేతల నుంచి రియాక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.

Read also: Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదు

కాగా.. కేసీఆర్ సర్కార్‌ తీరుపై ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాకు తమిళి సై ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో.. తాజాగా గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పెండింగ్ బిల్లులపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. పెండింగ్ బిల్లుల అంశం పూర్తిగా తన పరిధిలోనే ఉంటుందని, త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు తమిళసై. అయితే..అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత బిల్లులు గవర్నర్ దగ్గరకు వెళ్తాయి. దానిపై గవర్నర్ సంతకం చేసి ఆమోదిస్తేనే బిల్లులు అమల్లోకి వస్తాయి. ఈనేపథ్యంలో.. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిన బిల్లుల్లో 8 బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అరు చట్టసవరణ బిల్లులతో పాటు రెండు కొత్త బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు వీటికి గవర్నర్ తమిళి సై ఆమోదం తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది… అయితే.. ఇలాంటి తరుణంలో బిల్లులకు ఆమోదం తెలిపే విషయం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని, తనకు దానిపై విస్తృత అధికారాలు ఉన్నాయంటూ తమిళి సై చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
Google Removes apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి..

Exit mobile version