Ramya Haridas: నాకు పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి.. పాట పాడుతూ ఎంపీ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే వరుడ్ని చూడమని ఓ కాంగ్రెస్ ఎంపీ చక్కటి పాటలు పాడి రిక్వెస్ట్ చేసారు. తనకి ఇంకా పెళ్ళి కాలేదని, ఓతమిళ అబ్బాయి వుంటే చూడమని ఆమె నాయకులను పాటపాడి కోరిన తీరు అందరిని ఆశ్చర్యపరించింది. ఓ ఎంపీ ఇలా వరుడు కావాలని అదీ తమిళ అబ్బాయినే చూడాలని నాయకులను రిక్వెస్ట్ చేస్తూ పాటపాడిన తీరు అందరిని ఆకర్షిస్తోంది.
read also: Macherla Niyojakavargam : నితిన్ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మిస్!
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈ రోడ్ లో కొత్తగా ఎన్నికైనా వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈనేపథ్యంలో ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అద్యక్షుడు లెనిన్ ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేను తమిళనాడు యూత్ కాంగ్రెస్ నాయకుల్ని , ఆ పార్టీ వార్డ్ మెంబర్లను ఉద్దేశించి కేరళ.. అలథూర్ కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఆమె స్టేజ్ పై కమల్ హాసన్ మూన్రం పిరై సినిమాలోని కన్నె కలైమానే పాట, విజయకాంత్ ఆసై మచాన్ మూవీలో ఆదియిలా చేసిన సొల్లి అంటూ తమిళ పాటలు ఆలపించారు.
ఆమె పాటకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. రమ్యకు ఇంకా పెళ్లి కాలేదని.. తమిళ అబ్బాయిని చూడమని నాయకులను ఆమె కోరారు. రమ్య ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో కొంత భాగం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. ఈనేపథ్యంలో పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లినప్పుడు తను తమిళ భాషలోనే వారితో మాట్లాడాల్పి వస్తుంది కావున.. తనకు తమిళ అబ్బాయిని చూడండని, బాగుంటే ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటాను అంటూ స్టేజ్ పై ఎంపీ పాట పాడి వరుడు కావలెను పాటను పాడారు. ఎంపీ రమ్య పాటపాడిన తీరును సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వావ్ ఎంపీ కే వరుడు కావలెనని పాట పాడటం భలే వుందని కొందరు నెటిజెంట్లు కామెంట్లు పెడుతున్నారు.
read also: Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ బాట.. ఎందుకో తెలుసా..?
అయితే.. రమ్య హరిదాస్ కేరళలో అలథూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రమ్య తల్లి ఇంట్లో బట్టలు కుడితే, తండ్రి రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు. కాగా.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇచ్చిన ఇంట్లోనే ఇప్పటికీ రమ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఎంపీ రమ్య పదో తరగతి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా కోర్సు చేశారు. కాగా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పీకే బిజుపై 1,58,968 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే.. ఎన్నికల ప్రచారంలోనూ రమ్య, పాటలు పాడుతూ జనాలను హుషారెత్తించేవారు. ఆ..ప్రచారంలో రమ్య పాటలను వినడానికి చాలా మంది తరలివచ్చేవారు. మరి ఎంపీ రిక్వెస్ట్ కు ఏ వరుడు స్పందిస్తారో..
Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!