Kerala CM Pinarayi Vijayan Speech In Khammam BRS Public Meeting: ఖమ్మంలో నిర్వహించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభలో కేరళ సీఎం పినరయి విజయన్.. కేంద్రంలోని బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా ఆరోపించారు. కేసీఆర్ చేపట్టిన పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉందని.. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోందని.. బీజేపీ హయాంలో దేశంలోని రాజ్యాంగం సంక్షోభంలో పడిందని మండిపడ్డారు. రాష్ట్రాల సమ్మేళనమే మన భారతదేశమని.. ఫెడరల్ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదని అన్నారు.
Secretariat Dharma Case: చనిపోయి, బతికిన ధర్మా.. ట్విస్టులు రివీల్ చేసిన ఎస్పీ
ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోందని.. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోందని విజయన్ ఆరోపించారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి పాలిస్తున్నాయని.. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఏయే రాష్ట్రాల్లో అయితే విపక్షాలు అధికారంలో ఉన్నాయో.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తున్నారని.. సంస్కరణల పేరుతో కేంద్రం నైతిక విధానాలను ఆచరిస్తోందని ఫైర్ అయ్యారు.
Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని.. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విజయన్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారని.. కార్పొరేటర్లకు మోడీ తొత్తుగా మారారని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందని, కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని, కేరళలోని వాటి అమలుకు ప్రయత్నిస్తానన్నారు. కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని భరోసా కల్పించారు.
Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి