Site icon NTV Telugu

KCR : ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా..?

Kcr 5

Kcr 5

KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేసిందని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజలకు అందుతున్న ఫలాలను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా రైతులు మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే దుస్థితికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో ఢిల్లీ స్థాయిలో పోరాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ వ్యతిరేకత ఇప్పటికే ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు

Exit mobile version