Site icon NTV Telugu

KCR : యశోదలో కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

Kavitha Kcr

Kavitha Kcr

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. గత గురువారం సాయంత్రం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహాతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం వైద్య బృందం ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది.

Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?

వీటిలో బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, సోడియం స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు అవసరమైన వైద్యసహాయం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై గురువారం రాత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నిశితంగా పర్యవేక్షణ కొనసాగుతోంది’’ అని హెల్త్ బులిటెన్‌లో వివరించారు.

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇవే

Exit mobile version