సీఎం కేసీఆర్ రైతులకు పట్టిన పెద్ద చీడ: కోదండరాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు ఓవైపు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు చీడ పడితే ఏం చేయాలో తెలుసన్న ఆయన.. రైతులకు పట్టిన అతిపెద్ద చీడపీడ కేసీఆరే అని విమర్శించారు. ఒకప్పుడు వ్యవసాయం పండుగ అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దండగ అంటున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిలబడలేని పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. తెలంగాణలోని కల్లాల వద్ద ఏ రైతును కదిలించినా ఒక్కటే మాట చెబుతున్నారన్నారు.
ఇలా అయితే బతకడం కష్టం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని, వ్యవసాయం కూడా చేయలేమని అంటున్నారని కోదండరాం అన్నారు. అయినా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నలుగురికి తిండి దొరకాలని కష్టపడి పంటను పండిస్తే మమ్ముల్ని ఆదుకోకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని రైతులు అంటున్నారని కోదండరాం అన్నారు. మరోవైపు కల్లాల వద్ద అనేక సమస్యలు ఉన్నాయని, తరుగు పేరుతో అధిక ధాన్యం కోతలు పెడుతున్నారని, కల్లాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవని రైతులు చలికి వణుకుతూ, కల్లాల వద్ద మరణిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని కోదండరాం ఆరోపించారు. త్వరలో రైతులు కేసీఆర్ సర్కార్‌ను భూ స్థాపితం చేస్తారని హెచ్చరించారు కోదండరాం.
Also Read
- Tags
- congress
- Farmers
- kodanda ram
- tjs
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!