Site icon NTV Telugu

KCR-Bandi Sanjay: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే ఫ్రేంలో కేసీఆర్, గవర్నర్, బండిసంజయ్‌..

Tamilasai Kcr

Tamilasai Kcr

KCR Introduces Bandi Sanjay: ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఒకే వేదికను పంచుకోవడం చూస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన స్వాగత కార్యక్రమం ఈ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది. విడిదికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేశారు. అయితే.. రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఎప్పుడూ నిప్పులు చెరుగుకునే అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపైన కనిపించడం ఒక ఎత్తైతే.. వాళ్లను రాష్ట్రపతికి పరిచయం చేయటం మరో ఎత్తు. రాష్ట్రపతికి ప్రజాప్రతినిధులను పరిచయం చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read also: Volodymyr Zelenskyy: ఆ విషయంలో భారత్ భాగస్వామ్యం ఆశిస్తున్నా

నేతలు వరుసగా వేదికపైకి రావడంతో కేసీఆర్ వారిని రాష్ట్రపతికి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ నేతల తర్వాత బండి సంజయ్ కూడా క్యూలో ఉన్నారు. రావడానికి వెనుకాడినా కేసీఆర్ వెంటనే స్పందించి.. బండి సంజయ్ రమ్మని పిలిచారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను రాష్ట్రపతికి పరిచయం చేశారు. అదే క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రావడంతో ఆయన్ను కూడా సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి పరిచయం చేశారు. ఈ సీన్ సర్వత్రా మరింత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ పై నిత్యం నిప్పులు చెరిగే బండి సంజయ్, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే కేసీఆర్ వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్‌ని సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేయడం ..ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశమైంది. ఇదే కదా అద్భుతమైన ఫోటో అంటూ కొందరు కమెంట్‌ చేస్తుంటే. మరికొందరు ఫోటో ఆఫ్ ది ఇయర్‌ అంటూ కమెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో బండి సంజయ్‌ పోస్ట్‌ చేయడంతో రాష్ట్రప్రజలు ఆశక్తికరంగా చూస్తున్నారు. ఒకే వేదికపై సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై, బండిసంజయ్‌ ముగ్గురు కనడటంపై వావ్‌ ఇన్‌ట్రెస్టింగ్‌ ఫ్రేం అంటూ పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు.
Tsrtc Discount: టీఎస్ ఆర్టీసీ బంప‌రాఫ‌ర్.. ఇలా చేస్తే టికెట్లపై భారీ డిస్కౌంట్..

Exit mobile version