Site icon NTV Telugu

BRS : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం..

Brs

Brs

BRS : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లతో కలిసి కేసీఆర్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇటీవలి కాలంలో ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ తరచుగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలను ఆయన చర్చిస్తున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితిలో కొత్త తరానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.

Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?

ఈ క్రమంలో తెలంగాణ అస్తిత్వ పోరాటం, రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్‌ పోషించిన పాత్ర, నదీ జలాల్లో జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం వంటి అంశాలను విద్యార్థులు, యువతకు చేరవేయాలని పార్టీ భావిస్తోంది.

టీఆర్‌ఎస్‌గా ప్రారంభమై 25 ఏళ్లుగా సాగుతున్న పార్టీ ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా మరియు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేసిన కృషిని వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే విస్తృత స్థాయి సమావేశం తరహాలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

Green fuel: భూగర్భంలో భారీగా “గ్రీన్ ఇంధన” నిల్వలు.. 1.70 లక్షల ఏళ్లకు సరిపోయే అద్భుత నిధి..

Exit mobile version