Kavitha : ఇళ్లను కూల్చివేసిన నాయకులకు ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది
- వెలుగుమట్లలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కవిత
- రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వంపై విమర్శలు
- ఆడబిడ్డల బాధ చూసి కవిత ఆవేదన
- పేద ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలుగుమట్ల ప్రాంతంలో రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల దీనస్థితిని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం , స్థానిక నాయకుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. చిన్న పిల్లలు, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయనే కనీస మానవత్వం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని కవిత మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన బుల్డోజర్లు పేదవాడి సొంతింటి కలను ఛిన్నాభిన్నం చేశాయని, విద్యార్థుల పుస్తకాలతో సహా సామాన్లన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ఆడబిడ్డలు, చిన్న పిల్లలు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
“ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదు.. అలాంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చూస్తుంటే కడుపు తరిగిపోతోంది” అని కవిత వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇళ్లను కూల్చివేసిన నాయకులకు, ఈ ప్రభుత్వానికి బాధితుల శాపం కచ్చితంగా తగులుతుందని ఆమె హెచ్చరించారు. పేదవాడి ఆవేదనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సూచించారు. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న కొందరు నాయకులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇది పేదవాడి జీవిత కాలపు ఆవేదన అని, కానీ కొందరు నాయకులకు ఇది ఎగ్జిబిషన్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
కేవలం పర్యటనలు చేసి వెళ్లే టూరిస్టుల్లా కాకుండా, బాధితులకు నిజమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే ఉంటానని బాధితులకు కవిత భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తన ఆడబిడ్డల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!