Kavitha : తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఎక్కువ వస్తుందని ఆమె వెల్లడించారు. కొత్త పార్టీదేముందని, ఎప్పుడైనా పెట్టొచ్చన్నారు కవిత. కానీ ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలని ఆమె వెల్లడించారు. కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నం కాదని, ప్రజల నుంచి వస్తోన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నేను ఆరోపణలు చేస్తున్నానన్నారు. 27మున్సిపాలిటీల విలీనం వెనుక పెద్ద స్కాం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి నేను చేసిన రాజీనామాకు ఇంకా ఆమోదం తెలుపలేదని, ప్రజాప్రతినిధిగా సినిమాల పైరసీకి నేను వ్యతిరేకమన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు నేను కూడా వెబ్ సైట్స్ వెతికి ఫ్రీ సినిమాలు చూశానన్నారు కవిత.
Rain Alert: ఓ తుఫాన్ ముప్పు తప్పింది.. మరో వాయుగుండం భయపెడుతోంది..!