Kalvakuntla Kavitha : లండన్‌లోని తెలంగాణ ప్రవాసులతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. జాగృతిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే తమ సంకల్పమని, సామాజిక తెలంగాణ కోసం జాగృతి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ‘‘ప్రజలు అవసరం అనుకుంటే, సరైన సందర్భంలో పార్టీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజల జీవితాల్లో మార్పు తేవడం మా లక్ష్యం. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు సమయం ఉంది.. అప్పటివరకు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం’’ అని వ్యాఖ్యానించారు.
తాను ఏ జాతీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని కవిత స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ. అభివృద్ధి దారిలో ఉన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. మరోవైపు, భాజపా డీఎన్‌ఏ నాకు సరిపడదు’’ అని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి కోసం రెండు దశాబ్దాలపాటు తాను కష్టపడ్డానని, కానీ పార్టీలో కొందరి స్వార్థం వల్ల పరిస్థితులు దిగజారాయని కవిత అన్నారు.
Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!
‘‘కోట్లాది మంది బాధపడకూడదనే ఉద్దేశంతోనే పార్టీలో చీలికలు రాకుండా తట్టుకొని నిలబడ్డాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఓటమి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు అనేక కుట్రలు జరిగాయి. విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత మౌనం వహిస్తే తప్పవుతుంది కాబట్టి, ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది’’ అని ఆమె వివరించారు.
‘‘పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టి నేనూ పార్టీ ఇచ్చిన పదవిని తిరస్కరించాను. నిర్ణీత విధానం ప్రకారం రాజీనామా చేశాను. కానీ ఛైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. ఈ పరిస్థితికి నేను కారణం కాదు.. అవతలివాళ్లే కారణం’’ అని కవిత స్పష్టం చేశారు. జైలు జీవితం తనలో అనేక మార్పులు తెచ్చిందని, సమూలంగా మార్చేసిందని కవిత అన్నారు. ‘‘నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై కృషి చేయాలి. కష్టాలు ఎదురైనా, కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా ముందుకు వెళ్తాను’’ అని ఆమె స్పష్టం చేశారు.
Tilak Varma: “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉంది..
