Bandi Sanjay: బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ చౌక్ కు బయలుదేరారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమం బీజేపీ యువమోర్చ నిర్వహిస్తుందన్నారు.ఆత్మ గౌరవ ప్రతీక మన మువ్వన్నెల జెండా ప్రతి ఇంటి పై ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యాన్ని నెహ్రు కుటుంబానికి భజన చేసేలా వ్యవహరించిందన్నారు. చరిత్రను తెరమరుగు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
Read also: Har Ghar Tiranga 2024: హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ ఎలా పొందాలంటే..?
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వర్గాలు, మతాలుగా చీల్చిందన్నారు. నెహ్రు అనాలోచిత విధానాల వల్ల చాల మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో భాగం కాదనుకుందా కాంగ్రెస్ అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసింది బీజేపీ అన్నారు. బంగ్లాదేశ్ లో దారుణ మరణహోమం జరుగుతుంటే రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. చైనా అనుకూల విధానాలు , వారి ఆదేశాలను రాహుల్ గాంధీ పాటిస్తారన్నారు. మీ సోషల్ మీడియా డిపి లను మార్చండి . మహనీయుల ఫోటోలు ,జాతీయ జెండాలు డీపీ లుగా పెట్టుకోండన్నారు. బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదన్నారు.
KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్ వేదిగా కేటీఆర్ ట్వీట్